icici fastag closing issue

Name of Complainant s.jitendra
Date of ComplaintFebruary 13, 2021
Name(s) of companies complained against
Category of complaint Miscellaneous
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by s.jitendra:

నా పేరు S.JITENDRA. టీవీ 5 న్యూస్ ఛానల్ లో deputy output editor గా పనిచేస్తున్నాను. నా కారు నంబర్ AP 29 BT 1202. నేను 2019 నవంబర్ 28 వ తేదీన  హైదరాబాద్ చైతన్యపురి ICICI బ్రాంచిలో FASTAG కొనుగోలు చేశాను. నా టాగ్ సీరియల్ నంబర్ 190507459. టాగ్ అకౌంట్ నంబర్.. 22081507. 500 రూపాయలతో టాగ్ కొనుగోలు చేస్తే.. 200 రూపాయలు బ్యాలన్స్ వచ్చింది. జనవరి 11 వ తేదీన యాదాద్రి జిల్లా గూడూరు టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించగా.. 90 రూపాయలు కట్ అయింది. జనవరి 12 వ తేదీ అనగా.. మరుసటి రోజున తిరుగు ప్రయాణం కాగా.. మళ్లీ అదే చోట 90 రూపాయలు కట్ అయింది. వెరసి 180 రూపాయలు పోను.. ఇంకా నా అకౌంట్లో 20 రూపాయలు మిగలాలి. కానీ 345 రూపాయల ఓ లావాదేవీని తప్పుగా నా అకౌంట్ లో డెబిట్ చేశారు. ఇందులో నా ప్రమేయమేమీ లేదు. ఈ తప్పుడు లావాదేవీ కారణంగా నా అకౌంట్ నెగెటివ్ బ్యాలన్స్ లోకి వెళ్లింది. దీంతో నా అకౌంట్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. నాకు వచ్చిన మెసేజ్ ను గమనించి.. వెంటనే కాల్ సెంటర్ కు ఫోన్ చేశాను. వివరాలన్నీ చెప్పగా.. వారు కారు ఫోటోలు, RC ఫోటోలు పెడితే క్యాష్ బ్యాక్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత చాలా కాలానికి క్యాష్ బ్యాక్ చేశామని చెప్పారు.. కానీ బ్లాక్ లిస్ట్ నుంచి మాత్రం నా టాగ్ ను తొలగించలేదు. పైగా నా సెక్యూరిటీ డిపాజిట్ ను కూడా మినహాయించేసుకున్నారు. క్యాష్ బ్యాక్ చేశాక మళ్లీ డిపాజిట్ ఎలా మినహాయించుకుంటారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఈ మొత్తం వ్యవహారం వల్ల దాదాపు ఏడాది కాలం పాటు.. FASTAG ఉంచుకుని మరీ… నగదు లేన్లలో కారులో వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ విషయమై అనేకసార్లు కాల్ సెంటర్ ను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. గట్టిగా అడిగితే.. మీరు ఫిర్యాదును తప్పుగా నమోదు చేశారు. అందుకే మీ డబ్బులు వెనక్కి రాలేదు.. అంటూ పొంతన లేని సమాధానం చెప్పారు. నా తప్పే లేనప్పుడు నేను ఎందుకు ఇబ్బంది పడాలి అని చాలా సార్లు ప్రశ్నించాను. అయినా వారి నుంచి ఒకే రకమైన సమాధానం వచ్చింది. ఇలా ఏడాది కాలం వారితో ఇబ్బందులు అనుభవించాక… ఇంతకీ ఇప్పుడు ఏం చేయాలంటూ వారిని అడిగితే.. రీచార్జి చేసుకోవాలని చెప్పారు. సరే రీఛార్జి చేసి వెంటనే అకౌంట్ క్లోజ్ చేసుకుంటాను అని చెప్పి 23 డిసెంబర్ 2020 న 712 రూపాయలతో రీఛార్జ్ చేశాను. తీరా అందులో నుంచి కూడా వందకు పైగా మినహాయించుకుని… చివరికి 601 రూపాయలు నాకు బ్యాలన్స్గ్ గా చూపారు. సరే ఇప్పటికైనా సమస్య తీరింది కదా.. ఇకపై ఈ గొడవ వద్దనుకుని.. అకౌంట్ క్లోజ్ చేయాల్సిందిగా వెంటనే అప్లికేషన్ పెట్టుకున్నాను. 23 వ తేదీన నేను అకౌంట్ క్లోజ్ చేయాలని దరఖాస్తు చేస్తే.. ఇప్పటివరకు నా అకౌంట్ పూర్తిగా క్లోజ్ కాలేదు. దీని వల్ల నేను ICICI FASTAG తీయలేక… కొత్త FASTAG వేసుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజుల్లో FASTAG కు కేంద్రం ఇచ్చిన గడువు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో కాల్ సెంటర్ వారిని గత నెల రోజులుగా అనేక సార్లు సంప్రదిస్తున్నాను. అయినా ఫలితం శూన్యం. ఎప్పుడు అడిగినా వారు మరో మూడు రోజులు.. మరో నాలుగు రోజులు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తీరా ఇప్పుడు నాకు సమయం మించిపోయింది. ఇప్పుడు నేను ఏమి చేయాలో పాలుపోవడం లేదు. నేను ఇంతగా ఇబ్బంది పడుతున్నా.. వారి నుంచి కనీస సమాధానం, సమాచారం ఉండడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు. ధన్యవాదాలు.

Image Uploaded by s.jitendra:

icici fastag closing issue

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *